బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

Mar 8, 2025 - 21:40
Mar 8, 2025 - 21:43
 0  2
బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

44,45 వ వార్డు మహిళా పారిశుధ్య కార్మికులకు సన్మానం చేసిన బ్యూటీ పార్లర్

అసోసియేషన్ ప్రెసిడెంట్ మన్నెం పద్మావతి,  45 వ వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్

సూర్యపేట 08 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- నేటి  ఆధునిక కాలంలో మహిళలు అన్నిరంగాలలో విజయం సాధిస్తున్నారని బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, స్టార్ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు  మన్నెం పద్మావతి, 45 వ వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ లు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో   విద్యానగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 44, 45 వ వార్డులలో విధులు నిర్వహిస్తున్న  మహిళా పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా రంగంలో  మహిళలు అద్బుతంగా రాణించగలరని అన్నారు. పారిశుధ్య  కార్మికులు నిత్యం మనకు సేవలు అందిస్తున్నారని, వారి సేవలను గుర్తిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించామని అన్నారు.  అనంతరం కేక్ కట్ చేశారు. పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసి బహుమతులు అందజేసినారు.  ఈ కార్యక్రమంలో ఉమా బ్యూటీ పార్లర్ నిర్వాహకులు ఉమారాణి,  సుధా బ్యూటీ పార్లర్ రోజా, బాల కేంద్రం నిర్వాహకులు రాధాకృష్ణ, సాధన, జ్యోతి, శ్రీకల, రిజ్వాన, మునీభి, దాక్షాయణి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333