సెప్టెంబర్ 20న పెన్షన్ పెంపు కోసం డివిజన్ కేంద్రాల్లో నిరాహార దీక్షలు

Sep 14, 2025 - 19:55
Sep 14, 2025 - 19:57
 0  14
సెప్టెంబర్ 20న పెన్షన్ పెంపు కోసం డివిజన్ కేంద్రాల్లో నిరాహార దీక్షలు

రామన్నపేట 14 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో గ్రామ కమిటీ సమావేశంలో ఎన్. పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేంద్ర ఎన్నారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 6వేల కు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 20 నాడు జిల్లా వ్యాప్తంగా డివిజన్ కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని ఎన్.పి ఆర్.డి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది.కావున జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్ కేంద్రాల్లో నిరాహార దీక్షలు నిర్వహించేందుకు పిలుపునివ్వడం జరుగుతుంది అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని వికలాంగులకు విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలని వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లలో ఐదు శాతం ఇండ్లు ఇచ్చి కట్టించాలని వికలాంగులకు స్థానిక సంస్థల్లో నామినేట్ పోస్ట్లు అమలు చేయాలని వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని వికలాంగులకు నిరుద్యోగ భృతి 416 రూపాయలు అందించాలని బ్లాక్ లాక్ పోస్టులు వెంటనే విడుదల చేయాలని వికలాంగులకు ఉపాధి అవకాశాల్లో కల్పించాలని వికలాంగులకు ఉపాధి కోసం బ్యాంకు ద్వారా ఎలాంటి చర్తులు లేకుండా 100% సబ్సిడీతో 5లక్షల రుణ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్.పి. ఆర్.డి గ్రామ అధ్యక్షులు జడల లక్ష్మణ్ గ్రామ కార్యదర్శి జెల్ల ఉప్పలయ్య కోశాధికారి ముసుకు తిరుమలరెడ్డి ఉపాధ్యక్షులు దేశపాక సైదులు సహాయక కార్యదర్శి బండమీది ఎంకన్న,ఉపాధ్యక్షులు కంబాలపల్లి సైదులు,సహాయ కార్యదర్శి కలకోటి ధనమ్మ,సయ్యద్ కలీం, జలక సైదులు,జలక యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.