అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం
మునగాల 22 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిది:- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది తెలంగాణను సాధించుకొని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది ఈనెల 24న సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన విజయవంతం కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్,మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ , పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు కటికం సత్తయ్య గౌడ్ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని,పార్టీ చేరికల మీద ఉన్న దృష్టి ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని *కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్,మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ , పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు కటికం సత్తయ్య గౌడ్* లు అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....పార్టీ చేరికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద కాంగ్రెస్ కు లేదు.డిసెంబర్ 9 పోయి 4 నెలలు అయింది..ఇచ్చిన హామీలు ఏమైనయ్ సిఎం గారు.రైతులకు నట్టేట ముంచి, కష్టాలపాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది.రెండు లక్షల రుణమాఫీ ఎటుపోయింది..మహిళలకు ఇస్తానన్న 2500 ఎటుపోయాయ్..తులం బంగారం ఏటుపోయింది..కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపు.కాంగ్రెస్ పాలనకు..బిఆర్ఎస్ పాలనకు తేడా ఏంటో ప్రతి కార్యకర్త భాద్యతగా ప్రజలకు వివరించాలి.గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను కార్యకర్తలు గ్రహించి ఈ ఎన్నికల్లో ముందుకెళ్లాలి.ప్రతి కార్యకర్త భాద్యతగా గడప గడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటువేయాలని ప్రజలను అడగాలన్నారు.ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది.కేసీఆర్ పాలనే బాగుండేదని గ్రామాలలో చర్చ జరుగుతున్నది.ఇచ్చిన హామీల నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు.పార్టీలో ఉండి ఉన్నతమైన పదవులు అనుభవించి కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు విశ్వసించారు.నల్గోండ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తల కృషితో బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి .కోదాడ నుండి భారీ మెజార్టీ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేషు, సొసైటీ చైర్మన్లు కందిబండ సత్యం, సీతారాములు, రామ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి ఎలక వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.