స్థానిక జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు

జిల్లా కలెక్టర్& జిల్లా ఎన్నికల అధికారులు రిజర్వేషన్ ల సమాచారం పార్టీలకు ఇవ్వడంలో నిర్లక్ష్యం.
సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు.
జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున జడ్పిటిసి ఎంపిటిసి స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పేర్కొన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందించడంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఆదివారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా సమితి సమావేశం కామ్రేడ్ రంగన్న అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా జిల్లాల్లో జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు పోటీ చేసే అంశంపై లోతుగా చర్చించి ఎంపిటిసి జడ్పిటిసి స్థానాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ నిర్ణయించినట్లు జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పేర్కొన్నారు
ఈ సందర్భంగా వందేళ్లుగా పేదల కోసం నిరంతరంగా పోరాటం సాగిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుందని ప్రజలు ఆదరించి గ్రామాల్లో ఎంపిటిసి, జెడ్పిటిసి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ఆయన తెలిపారు. సిపిఐ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా సమితి సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామాలలో ఎంపిటిసి మండలాల్లో జెడ్పిటిసి అభ్యర్థులను ఎక్కువ స్థానాల్లో పోటీ కోసం ఇంకా కసరత్తును కొనసాగిస్తున్నట్లు వివరించారు. అలాగే సమావేశంలో సిపిఐ పార్టీ వందేళ్ల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్వహించడం జరిగింది. ముందుగా సమావేశంలో మరణించినటువంటి మృతవీరులకు సంతాపాన్ని తెలియజేశారు. మరియు రైతులు అధిక వర్షాలతో పంటలు నష్టపోతున్నందువల్ల రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దబాబు ఆశన్న రంగన్న రవి జిల్లా సమితి సభ్యులు రవి కాసిం అలాగే ప్రజా సంఘాల నాయకులు పరమేష్ కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.