శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు
పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ ఏపీలో గత వైకాపా ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులు.
ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు.