ఆర్‌టిఏ చెక్‌ పోస్టుపై ఏసీబీ అధికారులు తనిఖీలు

Dec 4, 2024 - 16:09
 0  3
ఆర్‌టిఏ చెక్‌ పోస్టుపై ఏసీబీ అధికారులు తనిఖీలు

జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల .జిల్లా మానవపాడు మండల పరిధిలో ఉన్న ఆర్‌టిఏ చెక్‌ పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రవాణాశాఖపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం మంగళవారం రాత్రి 8:00 నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించినట్లు సమాచారం. అంతరాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రైట్ చేశారు. ఏఎంఐ అధికారులు రమేష్, అమృతవర్షిని, కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, హోమ్ గార్డ్ గోవిందులను ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో..చెక్‌ పోస్టు ప్రాంతం నిర్మానుషంగా మారింది. ఒక్క వాహనం కూడా చెక్ పోస్ట్ దగ్గర నిలవకపోవడంతో..ఏం జరిగిందో అన్న పరిస్థితి అచెక్‌ పోస్టుపై ఏసీబీ అధికారుల దాడులుక్కడ ఏర్పడింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333