14 మంది వైద్య సిబ్బందికి సోకజ్ నోటీసులు.
జోగులాంబ గద్వాల 19 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించని కారణంగా 14 మందికి కలెక్టర్ సంతోష్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఆస్పత్రిని ఆకస్మికతనికి వెళ్లిన ఆయన సిబ్బంది గైరాజరైన విషయాన్ని గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీ చేశారు. అనంతరం వార్డుల్లో పర్యటించి వైద్య సేవల గురించి రోగులను ఆరా తీశారు .విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.