ఫిజిక్స్ ఒలంపియాడ్ లో ధనుష్ రెడ్డి ప్రధమ బహుమతి

Apr 1, 2025 - 21:30
 0  7

ధనుష్ రెడ్డిని సన్మానిస్తున్న గ్రామస్తులు

అడ్డగూడూరు 01 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

హైదరాబాదులోని రవీంద్రభారతిలో గత నెలలో జరిగిన శ్రీనివాస రామానుజన్ వారి ఫౌండేషన్ ఫిజిక్స్ ఒలంపియాడ్ లో 5వ తరగతి లో నల్గొండ జిల్లా ప్రారంభ బహుమతి వచ్చినట్లు ధనుష్ రెడ్డి మంగళవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు.బైరెడ్డి ధనుష్ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని అరవిందో పబ్లిక్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ధనుష్ రెడ్డికి ప్రధమ బహుమతి రావడంతో ఆయన తల్లిదండ్రులు నర్సిరెడ్డి ,శిరీష గ్రామస్తులు అభినందించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు శాలువ కప్పి సన్మానించారు.భవిష్యత్తులో మరిన్ని బహుమతులు గెలుపొందాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడెపు పాండు దాసరి బాలరాజు,పూలపల్లి సోమిరెడ్డి,బాలెంల దుర్గయ్య, గజ్జెల్లి రవి,బైరెడ్డి సందీప్ రెడ్డి, ఆసర్ల లక్ష్మయ్య,స్వామి,పూలపల్లి రాజశేఖర్ రెడ్డి,బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333