PRTU ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

Jul 27, 2024 - 20:26
Jul 27, 2024 - 20:34
 0  5
PRTU ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:-  మండలం లో PRTU సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అధ్యక్ష కార్యదర్శులు గోపగాని సుధాకర్, నంద్యాల చౌదరి రెడ్డి గార్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.* ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ సమస్య లపై మాట్లాడి సమస్యల సాధనకు PRTU సంఘం ఎల్ల వేళలా కృషి చేస్తుందని తెలియచేయడము జరిగింది.మోడల్ స్కూల్,కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను కూడా రాష్ట్ర శాఖ దృష్టి కి తీసుకు పోయి పరిష్కారం జరిగేలా కృషి చేస్తామని తెలియచేశారు. ఇట్టి కార్యక్రమం లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గుగులోత్ తావుర్య ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లు సత్యనారాయణ రెడ్డి భూతం సత్యనారాయణ, p. నరేందర్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు కొరదాల రాములు, గుణగంటి సురేందర్ గార్లు, మండల అసోసియేట్ అధ్యక్షులు రనబోథ్ గోపిరెడ్డి, మండల కార్యదర్శి పులుసు వెంకటేశ్వర్లు తంగేళ్ల వాసుదేవరెడ్డి, అశోక్ మల్లారెడ్డి, లింగరాజు,అప్పల సైదులు ఉపేందర్ రావు, వెంక్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.