భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దాం

Mar 23, 2026 - 19:00
Mar 23, 2026 - 19:22
 0  5
భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దాం

అడ్డగూడూరు 23 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ అమలు చేయాలి భగత్ సింగ్ జయంతి వర్ధంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి భగత్ సింగ్, రాజ్ గురు ,సుఖ్ దేవ్ స్ఫూర్తితో అసమానతలు లేని సమాజ నిర్మాణానికై ముందుకు సాగుదాం. అని సిపిఐ మండల రేఖల శ్రీనివాస్ అన్నారు.ఏఐఎస్ఎఫ్-ఎ ఐ వైఎఫ్ ఆధ్వర్యంలో అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు, విప్లవ యువకిశోరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ ల 95వ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ మండల కార్యదర్శి రేఖల శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా  కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, కంచనపల్లి ఉప సర్పంచ్ బెల్లి శ్రీకాంత్  మాట్లాడుతూ.. భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ చేసిన త్యాగాలను గుర్తించి వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బోనుగా సుదర్శన్ రెడ్డి,సోలిపురం నాగిరెడ్డి, చెడే నాగేష్ నక్క మల్లయ్య ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333