బిజెపి నాయకుల ముందుస్తూ అక్రమ అరెస్టులు
సూర్యాపేట, 24 మార్చి 2026 తెలంగాణవార్త విలేఖరి:- ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను సూర్యాపేట పట్టణంలో బిజెపి నాయకులు అసెంబ్లీ ముట్టడికి హైదరాబాదుకుపోకుండా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ముందుస్తూగా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. ఎన్నికల ముందు అనేక అలివి గాని హామీలను 6 గ్యారంటీలు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజల ఓట్లు వేసుకొని అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పైన అయినా కూడా ఏ ఒక్క గ్యారెంటీ ఏ ఒక్క హామీ నెరవేర్చక ఉండటంవల్ల భారతీయ జనతా పార్టీ గత వారం రోజుల్లో రాష్ట్రం మొత్తంలో అన్ని కలెక్టరేట్ల ముందు మండల ఆఫీసుల ముందు ధర్నాలు చేసి హామీలను నెరవేర్చాలని మెమొరండాలి ఇవ్వడం జరిగింది.
అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నది మూడు రోజుల క్రితం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని బిజెపి రాష్ట్ర శాఖ బడ్జెట్ సమావేశాల చర్చలో భాగంగా ఈరోజు ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్కు బిజెపి నాయకులు వెళ్లకుండా పోలీసు వారు అడ్డుకొని తెల్లవారుజామున ఐదు గంటలకే అందుబాటులో ఉన్న నాయకులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలను కలుపుకొని ఉద్యమాలు, పోరాటాలు చేసి మెడలు వంచైనా హామీలను అమలు చేయిస్తామని, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల్ల నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు గత 2 బడ్జెట్లలో 23 వేల కోట్లు కేటాయించి నామమాత్రంగా 5000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్లో బీసీలకు 13 వేల కోట్ల బడ్జెట్ చూపడం వట్టి బూటకం మాత్రమే, బడ్జెట్ లెక్కలన్నీ కూడా తెల్ల కాగితాల మీద నల్ల గీతలు పెట్టి ప్రజలను అంకెల గారడితో మోసం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బూటకపు హామీలు అభయ హస్తం పేరుతో 6 గ్యారంటీలు 420 హామీలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని, రైతు భరోసా 10వేల నుండి 15000 ఇస్తానని, కౌలు రైతులకు పదివేల రూపాయలు ఇస్తానని, మహిళలకు 2500 ప్రతినెల ఇస్తానని, వికలాంగులకు 4000 పెన్షన్ ను 6000 చేస్తానని, ఆడపిల్లల పెండ్లిలకు లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇస్తానని, వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు గీత చేనేత వృత్తుల వారికి 2000 నుండి 4000 పెన్షన్ ఇస్తానని, నిరుద్యోగుల భృతి 3000 ఇస్తానని, నిరుద్యోగులకు కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా జాబు క్యాలెండర్ విడుదల చేస్తానని,
నిరుద్యోగులకు ఐదు లక్షల గ్యారెంటీ కార్డు ఇస్తానని, ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న పి ఆర్ సి ని వెంటనే విడుదల చేస్తానని, చదువుకునే బాలికలకు స్కూటీలు లాప్టాప్ లు ఇస్తానని, బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఇలా చెప్పుకుంటూ పోతే వందల హామీలు నోటికొచ్చినట్టు ప్రజలకు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య ఓడ దాటిన తర్వాత బోడ మల్లయ్య అన్న చందంగా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దగా మోసం చేసి గ్యారెంటీ పత్రాలు కూడా ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి చూపించి మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చ కుంటే వెంటనే సీఎం గద్దె దిగిపోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల్ల నర్సింహ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశాడు.
ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారు జిల్లా ప్రధాన కార్యదర్శి దోసకాయల పని నాయుడు, జిల్లా నాయకులు పోలగాని ధనుంజయ గౌడ్, ఆకార పరిపూర్ణ చారి, నిమ్మల లవన్, యార్లగడ్డ రామారావు, నిమ్మల పురుషోత్తం, ఎస్ కే పటాన్ పాషా, ఎలుగురు రామ్మూర్తి గౌడ్ లు ఉన్నారు.