ఈషా ఫౌండేషన్ వారి గ్రామీణ విజయోత్సవంలో బహుమతులు అందుకున్న వెల్దేవి మహిళలు

అడ్డగూడూరు 26 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– ఈషా ఫౌండేషన్ వారి గ్రామీణ విజయోత్సవంలో గ్రామీణ మహిళలు నల్లగొండ జిల్లాలో మేకల అభినయ్ ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహించిన క్రీడల్లో బహుమతులు అందుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన మహిళ మూర్తులు లెగ్ అండ్ స్ట్రిక్ గేమ్ లో మొదటి బహుమతి గెలుచుకున్న నిమ్మల కవిత, బోడ వసంత, మౌత్ స్పూన్ అండ్ లెమన్ గేమ్ లో మొదటి విజయం సాధించింన గోలి మధు భార్గవి,ఇలాంటి ఆటపాటల్లో గ్రామానికి మంచి పేరు తేవడంతో ఆ గ్రామవాసులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీం లీడర్ మంటిపల్లి అనిత,అండ్ టీం బూత్ వివిధ ఆటల్లో విజయం సాధించిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.