సూర్యాపేటలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్..
సూర్యాపేట, 24 మార్చి 2026 తెలంగాణవార్త విలేఖరి:- సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుండె శ్రీకాంత్ తండ్రి శ్రీను పెయింటింగ్ వర్క్, అన్నాదురై నగర్ మార్చి శనివారం రాత్రి సూర్యాపేట పట్టణములోని సాయినగర్ నందు గల తూథ్కు నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనం జరిగి, సుమారు 03 తులాల బంగారం, సుమారు 20 తులాల వెండి వస్తువులు మరియు 1000 రూపాయల నగదు పోయినదనే ఫిర్యాదు మేరకు ఎస్ ఐ ఏడుకొండలు కేసు నమోదు చేసి, నిందితుదిని పట్టుకొని అతనివద్ద బంగారం, వెండి, నగదును రికవరీ చేసారు. నిందితుడు గత కొద్దిరోజులుగా చెడు అలవాటులకు, మద్యం తాగుటకు అలవాటుపడి సూర్యాపేట పట్టణములోని సాయినగర్ గల తూథ్కు నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనం చేసినట్లుగా, అలాగే గత ఫిబ్రవరి నెలలో కోర్ట్ ఆవరణలో గల ఏసీ లకు ఉన్న కాఫర్ వైరును దొంగిలించినట్లుగా అంగీకరించాడు. అలాగే అతనిపై గతంలో కూడా పాత దొంగతనం కేసులు ఉన్నట్లుగా అంగీకరించాడు. నేరస్తుడి వద్ద, 03 తులాల బంగారము, సుమారు 20 తులాల వెండి వస్తువులు మరియు 1000 రూపాయల నగదు మరియు కోర్ట్ నందు దొంగిలించిన ప్రాపర్టీ అంతయు రికవరీ చేసి, సోమవారం రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఐడి పార్టీ శ్రీరాములు, సిబ్బంది పాల్గొన్నారు.