కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ కార్యకర్తలారా ధైర్యంగా ఉండలి! భయం వద్దు?
ఎమ్మెల్యే ఎస్వేసిని రెడ్డి
పాలకుర్తి 11 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని పదేపదే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయి.గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, వ్యవస్థలన్నీటిని నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి నిరంతరం కృషి చేస్తూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుంది.ఈ సమయంలోనే మనకు లోక్ సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఆ తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వెంటవెంటనే వస్తాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక గౌరవించాలి. నూతనంగా వచ్చే వారిని పార్టీలో ఉన్నవారు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి.నూతన చేరికలు పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకే తప్ప. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకుల యొక్క ప్రాధాన్యతను తగ్గించేందుకు కాదు.ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందాలంటే ప్రభుత్వం నిర్దిష్టంగా ఉండాలి. పార్టీ పటిష్ఠంగా ఉండాలి. చేరికలు కేవలం నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చి అభివృద్ధికి దోహదపడతాయనే తప్ప, పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేయడం కోసం ఏమాత్రం కాదు.పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదు.మనం ఐదేళ్లు అధికారంలో ఉండబోతున్నాం. ప్రజల అభిమానంతో మరో ఐదేళ్లు కూడా మన ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కాబట్టి ఏ నాయకునికి, కార్యకర్తకు అన్యాయం జరగకుండా పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాం. ప్రతి ఒక్కరూ దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రయోజనాలతో ముందుకు సాగాలి. కార్యకర్తలు ఎవరూ కూడా అసహనానికి గురికావద్దు. బహిరంగంగాగాని, మీడియా, సోషల్ మీడియా వేదికగా నూతనంగా చేరుతున్న వ్యక్తులపై, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై, పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేసి అగౌరవపరచకూడదు. ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్ళి పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరిచి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుస్తాయి.మనం పోరాడింది బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ కుటుంబం మీద. గత ప్రభుత్వ హయాంలో నాయకుల ఒత్తిడితో కొంతమంది ప్రజాప్రతినిధులు పని చేశారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం పై నమ్మకంతో స్వేచ్ఛగా ప్రజా సేవ చేసేందుకు, ప్రజలకు పారదర్శకంగా, అవినీతి రహిత సేవలను అందించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరే వారిపట్ల విమర్శలు చేసి పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేయొద్దు.ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ పట్ల అసత్య ప్రచారాలు చేస్తూ, కార్యకర్తల మధ్య గందరగోళం సృష్టించడానికి విషం చిమ్ముతున్నారు.అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త,పాత అనే తేడాను మరిచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా గత ఎన్నికల్లో ఏవిధంగానైతే కష్టపడి పనిచేశారో,అదే విధంగా వచ్చే ఎన్నికల్లో కూడా కష్టపడి పని చేయాలి.పార్టీలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్ళి,సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తను,నాయకులను గుర్తు పెట్టుకుంటాం.మీకు ఎలాంటి నష్టం జరగకుండా బాధ్యత తీసుకుంటాం.మీ ప్రాధాన్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాం.
జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్!! కాంగ్రెస్ పార్టీ - పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలు మీ ఎస్విసిని రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.