800 కోట్ల జనాభాలో 100 కోట్ల మందికి మానసిక రుగ్మతలే.
ఆరోగ్యఅవకాశాలు, సిబ్బందిపై వ్యయం అంతంత మాత్రం కావడం కూడా ఈ దుస్థితికి కారణం.* ప్రపంచ దేశాల ఆరోగ్య విధానాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళనను ఐక్యరాజ్యసమితి, ఆయా దేశాల జనం కట్టడి చేయాలి.
*****************************************
-- వడ్డేపల్లి మల్లేశం 9014206412
--04....09....2025**************------
ప్రపంచ జనాభాలో ప్రతి 7గురిలో ఒకరికి మానసిక ఆందోళన వ్యాకులత వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉండడాన్ని గమనించినప్పుడు ప్రపంచ జనాభాలో 100 కోట్ల మందికి పైగా ఇలాంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లుగా మనం అంచనా వేయవలసి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అంచనా నివేదిక ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై చేస్తున్న ఆరోగ్యవ్యయ ములో మానసిక ఆరోగ్యానికి కేవలం 2 శాతం మాత్రమే ఖర్చు చేయడం వలన కుంబుబాటు మానసిక ఆందోళన, భయం, ఇతర భయంకరమైన లక్షణాలను కలిగి ఉన్న వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరగడాన్ని మనం గమనించవచ్చు. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రపంచంలో100 కోట్ల మందికి పైగా ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తన నివేదికలో వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. అంటే ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మతలు ఉన్నాయని వాటి బారిన పడి ఆందోళనకు గురి కావడంతో కనీస జీవన కార్యక్రమాలను కొనసాగించలేకపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయడం పరిశీలించదగిన అంశం. ఈ 100 కోట్ల మందిలో సుమారు 70 కోట్ల మంది కు o గు బాటు, మానసిక ఆందోళన, భయం, పిరికి తనం, ఏ పని కూడా స్వయంగా చేయలేకపోవడం వంటి ఆందోళన కలిగించే లక్షణాలతో కూడుకున్న బాధితులని ఆ సంస్థ తెలియజేసింది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మానసిక ఒత్తిడికి దారితీసి భయం, పి రికి తనం, వ్యాకులత, ఆందోళన అధికం కావడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆర్థికంగా కూడా వ్యవస్థ నష్టపోతున్నదని అనేక దేశాలలో ఈ రకమైనటువంటి దుష్ప్రభావం కనిపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకోవలసిన అవసరం ప్రపంచ దేశాలకు ఉంది.
కొన్ని గణాంకాలను పరిశీలిస్తే
**************************-
2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా" వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే, మెంటల్ హెల్త్ అట్లాస్ 2024" పేర ఓ నివేదికను విడుదల చేసినట్లు తెలుస్తున్నది. ఈ నివేదిక ప్రకారంగా యువత మరణాల్లో ఆత్మహత్యలు ప్రధానంగా ఎక్కువగా ఉంటున్నట్లు ప్రపంచవ్యాప్తంగా గనక గమనిస్తే ప్రతి 100 మరణాలలో ఒక ఆత్మహత్య ఉంటుందని 20 ఆత్మహత్యయత్నాల తర్వాత ఒక మరణం చోటు చేసుకుంటున్నదని ఆ నివేదిక వెల్లడించడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి చికిత్స అందిస్తున్న ఆరోగ్య సిబ్బందిని గమనించినప్పుడు ప్రతి లక్ష మందికి కేవలం 13 మంది మాత్రమే మానసిక ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నట్లు ఈ సంఖ్య తక్కువని WHO ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా ఆరోగ్యరంగంపై పెట్టే ఖర్చులో కేవలం 2 శాతం నిధులనే మానసిక ఆరోగ్యం పై వెచ్చిస్తున్నాయని, 2017 ఆ ప్రభుత్వాల యొక్క ధోరణిలో మార్పు రాలేదని, ఖర్చును తగ్గించిన కారణంగా సకాలంలో మానసిక ఆందోళన సమస్యలను పరిష్కరించలేకపోతున్నట్లు సంస్థ వెల్లడించడం ఆయా దేశాలకు గుణపాఠం కావలసినటువంటి అవసరం ఉన్నది. మానసిక ఆరోగ్యం పైపెడుతున్న ఖర్చును ప్రజల జీవన వికాసానికి సంబంధించిన ఖర్చుగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నదని, కానీ ఆయా దేశాలు వాణిజ్య ధోరణితో చూడకూడదని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టె డ్ రోస్ ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ప్రతి దేశం కూడా ఖర్చును చేయడంలో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించడం గమనించదగిన విషయం.
స్కిజో ఫ్రెనియా, బై పోలార్ డిజార్డర్ ప్రభావం :-
**************************************------
ప్రతి 200 మందిలో ఒకరు స్కిజోఫ్రీనియాకు ప్రతి 150 మధ్యలో ఒకరు బై పోలా రు డిసార్డర్ కు గురవుతున్నారని ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకర పరిణామం అని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. స్కి జోఫ్రీ నియా లక్షణం ఉన్నవాళ్లు మానసిక రుగ్మతకు గురై ఆలోచనలు భావోద్వేగాలు ప్రవర్తన అవగాహనలో లోపాలు ఏర్పడతాయి, భ్రమలు, మతి భ్రమణాలు, అస్తవ్యస్తమైన ఆలోచన విధానం, సామాజికంగా వెనుకబాటు వంటి లక్షణాలు ఈ రుగ్మత కలిగి ఉంటుందని జన్యు మెదడు రసాయన మరియు పర్యావరణ కారకాల కలయిక వలన ఈ వ్యాధి వస్తుందని పరిశోధకులు నమ్ముతున్నట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ దీనికి చికిత్స ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఇక బై పోలార్ డిసార్డర్ అంటే తీవ్రమైన మానసిక హెచ్చుతగ్గులను కలిగి ఉండే ఒక మానసిక ఆరోగ్య దుస్థితి అని అసాధారణమైన సంతోషంతో కూడిన మానియా లేదా హైపో మానియా విచారం నిస్సహాయత దశల మధ్య మారుతూ ఉంటుందని నిద్రలేమి, తీవ్రమైన ఉత్సాహం, తీవ్రమైన భావోద్వేగాలతో పాటు తీవ్రమైన విచారం నిస్సహాయత ఆనందాన్ని కోల్పోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక మానసిక ఆరోగ్య రుగ్మత అని దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ లక్షణాలు మారవచ్చునని దీనికి మందులు మరియు మానసిక చికిత్స ఉన్నాయని మానసిక నిపునులు అభిప్రాయపడుతున్నారు. తగిన చికిత్స తీసుకోవడం, కుటుంబ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారంతో సరైన మానసిక స్థితిలోనికి రావడానికి అవకాశం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి రోగ గ్రస్తులకు ఆయా దేశాలు ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్లో నిధులను ఎక్కువగా కేటాయించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం, పోషకాహారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )