42 శాతం రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి

Dec 19, 2025 - 06:15
 0  81
42 శాతం రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి

 తిరుమలగిరి 19 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసినటువంటి చట్టాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని అందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని రాజకీయ పార్టీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి చేస్తూ ప్రధాన డిమాండ్ తో తిరుమలగిరి మండల కేంద్రం లోని పూలే - అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహనీయులకు పూలదండలు వేసి నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుమలగిరి మండల రజక సంఘం అధ్యక్షులు పులిమామిడి సోమన్న అధ్యక్షత వహించారు.ఈ దీక్షకు పలువురు మద్దతు తెలియజేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్త గట్టు మల్లయ్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బి సి డిక్లరేషన్ ప్రకటించి ఆ తర్వాత దానిని అమలు చేయకుండా సాకులు చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోడీీీీీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోయి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో బిసి బిల్లు ను చేర్చి రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాం ప్రభు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బి సి జేఏసీ ఆధ్వర్యంలోనే రాబోయే ఏటువంటి ఎన్నికలైనా అభ్యర్థులను నిలబెట్టి మా ఓటు మేమే వేసుకుని మా సీటు మేమే గెలుచుకొని రాజకీయ పార్టీలను శంకరగిరి మాన్యాలకు పట్టించి రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కందుకూరి సోమన్న మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాడి సాధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్ల అనుభవంతో బిసి రిజర్వేషన్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. సిపిఐ మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగన్న, ఎల్ హెచ్ పి ఎస్ నంగారభేరి రాష్ట్ర కార్యదర్శి మాలోతు జేత్యా నాయక్ , యూట్యూబర్ లతా శ్రీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేసి సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, ఏలిసోజు దీనదయాల్, కందుకూరి ప్రవీణ్,గిలకత్తుల రాము గౌడ్, షేక్ ఖాసిం,పోరెళ్ల లక్ష్మయ్య, పసునూరి శ్రీనివాస్,పయ్యావుల వెంకన్న, రూపాని వెంకన్న, ఆరాణి సోమరాజు, దుస్సా రామ్మూర్తి, చింతకింది సోమనారాయణ, ముద్దంగుల యాదగిరి చిలకల ప్రకాష్, శీలా ఉపేందర్,నలుగురి రమేష్, పులిమామిడి యాదగిరి, గిలకత్తుల హనుమాన్,మద్దూరి రాములు,పులిమాటి వెంకన్న, రూపాని వెంకన్న, బోనగిరి ముత్తయ్య, బుషిపాక ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి