ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి. 

May 1, 2024 - 20:55
 0  6
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి. 

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు 

ప్రపంచ కార్మికుల ఐక్యత దినోత్సవం మేడే స్ఫూర్తితో కార్మిక కర్షక శ్రామికులందరూ రానున్న కాలంలో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు  అన్నారు. బుధవారం 138వ మేడే వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం  కామ్రేడ్ ధర్మ బిక్షం  భవన్ నందు అరుణ పతాకాన్ని, బెజవాడ వెంకటేశ్వర్లు,ఏ ఐ టి యు సి జెండా సీనియర్ నాయకులు జానిమియా   ఆవిష్కరించిన అనంతరం ఏ ఐ టి యు సి ప్రాంతీయ అధ్యక్షులు  దంతాల రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు 18 గంటల వెట్టి చాకిరీ పని దినాలని వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహిస్తుండగా, ఆనాటి అమెరికా  ప్రభుత్వం కార్మికుల గుండెల్లోకి తుపాకీ గుడ్లు పేల్చడంతో వేలాదిమంది కార్మికుల గుండెల్లో నుండి  చిదిన రక్తం నుండి పుట్టిందే ఎర్రజెండా అని, ఆనాటి నుండి నేటి వరకు 138 సంవత్సరాలుగా మే 1న ప్రపంచ కార్మికుల ఐక్యత దినోత్సవం మేడేని దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని వారన్నారు ,భారతదేశంలో కార్మిక కరక్షకుల హక్కుల సాధన కోసం సిపిఐ మరియు ఏఐటీయూసీ  ఎన్నో ప్రజా పోరాటాలను నిర్వహించి కార్మికుల హక్కులను కాపాడిందని రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ప్రజల పైన పడుతున్న ఆర్థిక భారాలను తొలగించడం కోసం  మేడే స్ఫూర్తితో ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావలసిన అవసరం ఉందని వారన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘాలైన హెచ్పీసీఎల్ ఆయిల్ టాంకర్స్  యూనియన్, టైలరింగ్ యూనియన్, ప్లాట్ రిక్షా యూనియన్, రాజీవ్ నగర్ ఆటో యూనియన్, ఫ్లవర్ డెకరేషన్ యూనియన్, ఆర్టీసీ డ్రైవర్స్  యూనియన్, చామల లచ్చయ్య ఇంటిదగ్గర తదిత ప్రాంతాలలో తదితర ప్రాంతాలలో ఏఐటీయూసీ  జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనంతల మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, దొర పెళ్లి  శంకర్, చామల అశోక్ కుమార్, రేగటి లింగయ్య, దీకొండ శ్రీనివాస్, ఎండి పాషా, ఎడెల్లి శ్రీకాంత్  బూర సైదులు  పెన్డ్రా కృష్ణ,వాడపల్లి వెంకన్న,గాలి కృష్ణ, ఎల్ఐసి వెంక రెడ్డి, అయితరాజు లింగయ్య, వాడపల్లి గోపి,నిమ్మల శేఖర్, నేలపట్ల సైదులు, సేవ్య, తదితర సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333