2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గా నామినేషన్ వేసిన అంబటి మహేష్
తిరుమలగిరి 31 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
బీజేపీ పార్టీ 2 వ వార్డ్ అభ్యర్థి గా అమ్మటి మహేష్ గౌడ్ తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం లో నామినేషన్ వేయడం జరిగినది బీజేపీ పార్టీ ఎన్నికల ఇంచార్జీ కే జనార్దన్ రెడ్డి , అసెంబ్లీ ఇంచార్జీ హేమ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య జిల్లా ఉపాధ్యక్షులు దీనదయాల్ , మెడబోయిన యాదగిరి కట్కూరి ఉపేందర్ , ఓర్సు వెంకన్న ,ఓర్సు అశోక్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్ధి మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదిస్తే.. మీకు ఒక నాయకుడిగా కాదు, మీ ఇంటి మనిషిగా ఉంటాను. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ.. మన వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.మీ ఇంటి బిడ్డగా ఒక అవకాశం ఇవ్వండి…సామాజిక సేవ అంకిత భావంతో మీ రుణం తీర్చుకుంటాను.