తిరుమలగిరి మున్సిపల్ లో భారీగా నామినేషన్లు

Jan 30, 2026 - 21:43
 0  8
తిరుమలగిరి మున్సిపల్ లో భారీగా నామినేషన్లు

తిరుమలగిరి 31 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగిసింది. గత మూడు రోజులుగా సాగిన ఈ ప్రక్రియలో మొత్తం 160 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారావు వెల్లడించారు. మొదటి రోజు 9 నామినేషన్లు దాఖలు అయినాయి రెండవ రోజు కాంగ్రెస్ 25 బిఆర్ఎస్ 17 బిజెపి 09 సిపిఎం 02 స్వతంత్ర అభ్యర్థులు 05 మొత్తం 49 ముఖ్యంగా చివరి రోజైన శుక్రవారం నాడు మొత్తం 15 వార్డులకు గాను ఒక్కరోజే అభ్యర్థులు 102   నామినేషన్లు సమర్పించారు. రాజకీయ పార్టీల వారీగా వివరాలను పరిశీలిస్తే,  కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 73 నామినేషన్లు దాఖలు కాగా, బీఆర్ఎస్ నుంచి 39, బిజెపి నుంచి 24, సిపిఎం నుంచి 3, ఇతర పార్టీల నుంచి 3 నామినేషన్లు అందాయి. వీటితో పాటు 18 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. మూడు రోజుల కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ మొత్తం 145 మంది 160 నామినేషన్లు చేశారు.నామినేషన్ల స్వీకరణ గడువు ముగియడంతో, తదుపరి ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ వంటి కార్యక్రమాలు ఎన్నికల నియమావళికి లోబడి కొనసాగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి