నో మ్యాపింగ్ మరియు ఆనామిలీస్, క్యాటగిరి పై బిఎల్ఓ లకు అవగాహన కార్యక్రమం
జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల . మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నో మ్యాపింగ్ మరియు
అ నామీలిస్ క్యాటగిరి పై బి ఎల్ వో ల అవగాహన కార్యక్రమానికి హాజరై ఇటిక్యాల ఎంపీడీవో అడిషనల్ ఈ ఆర్ ఓ రమాదేవి మాట్లాడుతూ.... నో మ్యాపింగ్ లో చిన్న చిన్న తప్పులు చేసినందువలన మళ్లీ మ్యాపింగ్ చేయాలని నో మ్యాపింగ్ కి సంబంధించి నా నోటీసులు ఇచ్చిన వారికి క్యాటగిరి వైజుగా 1987 కంటే ముందు జన్మించిన వారికి సెల్ఫ్ సర్టిఫికెట్స్ గవర్నమెంట్ కి సంబంధించినవి ఏమైనా ఉంటే ఒకటి ఆధారం తీసుకోవాలని లేకుంటే ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయం నందు కులం సర్టిఫికెట్ తీసుకోవాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలను కోరారు. రెండవ కేటగిరి 1987 నుండి 2004 వరకు ఉన్నవారికి సెల్ఫ్ సర్టిఫికేట్ ఒకటి వారి యొక్క తల్లిది కానీ తండ్రి కానీ ఆధారాలు రెండు తీసుకోవాలని మూడవ కేటగిరి 2004 నుండి 2026 వరకు ఉన్నవారికి సెల్ఫ్ గా ఒకటి వారి తల్లిది కానీ తండ్రిది గాని అవ్వ తాతలది 3 ఆధారాలు తీసుకోవాలని ఎంపీడీవో బి ఎల్ వో లకు అవగాహన కల్పించారు. ఆనా మీలిస్ కేటగిరి మీద నోటీసులు వచ్చిన వారికి బిఎల్ఓ పేరు వయస్సు బిఎల్ఓ డిక్లరేషన్ చేసి నోటీసు వచ్చిన వారి ఆధారాలు ఏవైనా ఒకటి అప్లోడ్ చేసి మ్యాపింగ్ చేయవలసిందిగా బి ఎల్ ఓ లకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఇటిక్యాల ఎంపీడీవో అడిషనల్ ఈ ఆర్ ఓ,రమాదేవి,రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ సీనియర్ అసిస్టెంట్ మనోహర్ బిఎల్వోలు పాల్గొన్నారు.