హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి

Mar 13, 2025 - 14:04
Mar 13, 2025 - 17:13
 0  10
హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి

శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు.

ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు

-------- జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 13 మార్చ్ 2025 తెలంగాణవార్తా ప్రతినిధి :- జిల్లాలోని హోళీ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో సంప్రదాయ రంగులను ఉపయోగించి ఎదుటివారికి ఇబ్బంది కలుగకుండా జరుపుకోవాలని *జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్* జిల్లా ప్రజలకు సూచించారు. హోలీ పండుగ-2025 సందర్భంగా ప్రజల శాంతి భద్రతలను పరిరక్షించేందుకు జిల్లా ఎస్పీ కొన్ని సూచనలతో హోలీ పండుగను సురక్షితంగా జరుపుకునేందుకు ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు.

  జిల్లా ప్రజలకు పోలీస్ వారి సూచనలు , జాగ్రత్తలు

14-03-2025 నాడు 6:00 గంటల నుండి 12 గంటల వరకు హోలీ పండుగ జరుపుకోవాలి. సురక్షితమైన రంగులను ఉపయోగించండి – హానికరమైన రసాయనాలున్న రంగులను వాడకండి.

ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు మరియు వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధించబడింది.

ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దు – నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులు వాడరాదు.

ఎవరైనా తమ అనుమతి లేకుండా బలవంతంగా రంగులు పూయడం, శారీరక లేదా మానసిక వేధింపులకు గురిచేయడం తీవ్రంగా నేరంగా పరిగణించబడుతుంది. పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధం. మద్యం సేవించి వాహనం నడపకండి – మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం మరియు చట్టవిరుద్ధం.

 ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలను సమూహాలుగా తరలించడం, వీధుల్లో అవాంఛిత రీతిలో తిరగడం అనుమతించబడదు.

అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్లకు కాల్ చేయండి – ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.

 శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలకు అసౌకర్యం లేదా ప్రమాదం కలిగించే ఏ చర్యైనా కఠినంగా ఎదుర్కొనబడుతుంది.

ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు.

ప్రజలు హోలీ పండుగను అందరూ ఆనందంగా, సురక్షితంగా హోలీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State