హైదరాబాద్‌లో ఓ కీలక డివిజన్‌లో ఏసీపీ వసూళ్ల పర్వం
ఎస్ఐలు కూడా ఆ ఏసీపీకి నెలవారి మాములు ఇవ్వాల్సిందే.. లేదంటే ఛార్జీ మెమోలు జారీ ఆ ఛార్జీ మెమోలు తొలగించాలంటే తాను చెప్పినట్లు నడవాలని ఎస్ఐలకు వేదింపులు మహిళలను ఆఫీసుకు తెచ్చుకోవడం.. తర్వాత వాళ్ళని గుడికి తీసుకెళ్లి, వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ఆలయ సిబ్బందికి హుకుం జారీ తన పోలీస్ స్టేషన్‌లో ఏ కేసు పెట్టాలన్నా, కేసు రాజీ చేయాలన్నా తనకు వాటా ఇవ్వాల్సిందే ఓ కేసులో ఐదుగురిని తప్పించడానికి రూ.50 లక్షలకు మాట్లాడి, తన వాటా కింద రూ.25 లక్షలు తీసుకున్న ఏసీపీ మరో కేసులో తన ఛాంబర్‌లో రెండు వర్గాలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చి రూ.15 లక్షలు స్వాహా హైదరాబాద్‌లో తన డివిజన్‌లో పండుగలు ప్రశాంతంగా జరిపినందుకు పోలీసులకు డబ్బులు ఇవ్వాలని వ్యాపారుల దగ్గర రూ.5 లక్షల వసూలు వైన్స్ అర్ధరాత్రి తెరిచి పెట్టేందుకు రూ.5 వేలు, బార్లకు అయితే రూ.10 వేలు హోటళ్లు స్థాయికి తగ్గట్టు నెలకు రూ.10 వేల నుండి రూ.50 వేలు ఇవ్వాల్సిందే ఈ నెల వారి వసూళ్ల కోసం తన డ్రైవర్‌తో సహా నలుగురు సిబ్బందికి బాధ్యతలు అప్పగించిన ఆ ఏసీపీ