హరిత సాంకేతికతలతోనే ఎం ఎస్ ఎం ఈ లకు లాభాలు
ఇంధన పొదుపు సౌర విద్యుత్ తో పోటీతత్వం పెంపు
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్
ములుగు జిల్లా, సెప్టెంబర్ :03 : ములుగు రైస్ మిల్ అసోసియేషన్ సహకారంతో ఆర్ ఐ సి హెచ్ ఆధ్వర్యంలో రాంప్ గ్రీనింగ్ అఫ్ ఎం ఎస్ ఎం ఈ ఎస్ కార్యక్రమంపై అవగాహన సదస్సును మంగళవారం ములుగులో నిర్వహించారు. ఆర్ ఐ సి హెచ్ ప్రాజెక్ట్ మేనేజర్ సస్టైనబిలిటీ గురు చరణ్ ఉప్పరపల్లి మాట్లాడుతూ ఎం ఎస్ ఎం ఈ లు ఇంధన సామర్థ్యం వనరుల పొదుపు సౌర విద్యుత్ వంటి హరిత సాంకేతికతలను స్వీకరించడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు ప్రపంచ మార్కెట్లలో తమ పోటీతత్వాన్ని పెంచుకోవచ్చని వివరించారు. గోయింగ్ గ్రీన్ అనేది పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యాపార స్థిరత్వం భవిష్యత్ పోటీతత్వానికి కీలకమని పేర్కొన్నారు.ములుగు రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బాదం మాట్లాడుతూ పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను పాటించడంతో పాటు సౌర విద్యుత్ ఇతర హరిత సాంకేతికతలను స్వీకరించాలని సూచించారు. తద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించి స్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు.ములుగు డి ఐ సి జనరల్ మేనేజర్ ఏ. సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఎం ఎస్ ఎం ఈ లు రాంప్ గ్రీనింగ్ అఫ్ మ్సమ్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు స్థిరమైన సాంకేతికతలను అవలంబించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైస్ మిల్ పరిశ్రమల ప్రతినిధులు ఎం ఎస్ ఎం ఈ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.