స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత* ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మండల కేంద్రానికి చెందిన గునగంటి మధు ఈనెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి 15వ తేదీన మృతి చెందాడు. మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని భావించి రూ.85000 పూర్వ విద్యార్థుల తరఫున మధు భార్య స్వప్న, కుమారుడు వీక్షిత్, తల్లి రాములమ్మలకు అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు ఉన్నారు.