స్తూరబాయి విద్యాలయం కి నీటి నిల్వచేసే నీళ్ల ట్యాంక్ వితరణ

జోగులాంబ గద్వాల 11 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- వడ్డేపల్లి స్పందించే గుణం గొప్పది 393 మంది విద్యార్థిని లు విద్య ను అభ్యసిస్తున్న వడ్డేపల్లి కస్తూర్భా విద్యాలయం లో నీటిని నిల్వ ను చేసే నీళ్ళ ట్యాంక్ యొక్క అవసరం ఉన్నదని తెలుసుకున్న శాంతినగర్ సేవా సమితి సభ్యుడు *షేక్ అస్లాం షరీఫ్ 1000 లీటర్ ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న నీళ్ళ ట్యాంక్ ను శనివారం రోజు వితరణ చేశారు. ఈ సందర్బంగా కస్తూర్భా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ పద్మ మాట్లాడుతు " స్పందించే గుణం ప్రతి ఒక్కరిలో ఉండదని, సమాజంలో ఇలాంటి వారు చాలా అరుదు గా ఉంటారని,ప్రస్తుతం నీళ్ళ ట్యాంక్ అవసరం ఎక్కువ గా ఉన్నదని, అది గుర్తించి అస్లాం నీళ్ల ట్యాంక్ ను మా విద్యాలయం ఇవ్వడం మాకు సంతోషము అని, ఈ సందర్బంగా తనకు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతున్నాం. దాతలు విద్యాలయం కు మరిన్ని మౌళిక వసతుల రూపకల్పన ముందుకు రావాలని ఆమె విజ్ఞపతి చేశారు. ఈ కార్యక్రమం లో సేవా సమితి సభ్యుడు దాసువరం నాగరాజు, కస్తూర్భా విద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.