చిన్నంబావి మండలంలో దారాసింగ్ ఆధ్వర్యంలో బిజెపిలోకి భారీగా చేరికలు
11-01-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం :- చిన్నంబావి మండల పరిధిలో రాష్ట్ర యువ నాయకుడు దారాసింగ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి పార్టీలో చేరిక.చిన్నంబావి మండలంలో రాష్ట్ర యువ నాయకుడు ధారసింగ్ ఆధ్వర్యంలో ఉదృతంగా సాగుతున్న వలసలు.రోజురోజుకు బలపడుతున్న బిజెపి పార్టీని చూసి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు కొల్లాపూర్ తాలూకా ఇన్చార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు బిజెపి రాష్ట్ర నాయకుడు ధారా సింగ్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నంబావి మండలంలోని కొప్పునూరు, అయ్యవారిపల్లి, వెల్టూరు, బెక్కెం, చెల్లెపాడు గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు సంబంధించిన 100 మంది కి పైగా నాయకులు కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిన్నంబావి మండలం తో పాటు కొల్లాపూర్ నియోజక వర్గంలో బిజెపి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని స్థానిక ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడవకముందే ప్రజలు అసహ్యించుకుంటున్నారని దీనికి ఉదాహరణనని చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు స్వచ్ఛందంగా బిజెపిలో చేరారుఅని అన్నారు.రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందన్నారు. అనంతరం రాష్ట్ర నాయకుడు ధారాసింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కకు పెట్టి అధికార పార్టీ నాయకుల సొంత లాభాల కోసం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ మరింత బలపడుతుందని మండలంలోని వచ్చే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ సత్తా చాటుతుందని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీల చేరిన వారిలో ముఖ్య నాయకులు తగరం ఉగ్ర నరసింహ( టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు),తగరం నాగరాజు( గ్రామ దండోరా సంఘం అధ్యక్షుడు ), వడ్డెమాను నరసింహ (దండోరా కళాకారుడు, ప్రధాన కార్యదర్శి), కత్తి నారాయణ, నరసింహ, బాలకృష్ణయ్య, వడ్డెమాను నిరంజన్, తగరం మద్దిలేటి, కత్తి రాజ్ కుమార్, తగరం కృష్ణయ్య, వెంకటస్వామి, తోళ్ల నాగేంద్రం, తగరము ఉదయ్ కుమార్, నరేష్, అయ్యవారిపల్లి గ్రామం నుంచి చేరిన వారిలో వెంకటస్వామి, రామకృష్ణ, హోసన్న, శేఖర్ రెడ్డి, రాజు, వెల్టూరు గ్రామం నుంచి చేరిన వారిలో నాగ మద్దిలేటి, నవీన్, అజిత్, బాబి, తేజ, స్వరూప్ రాజ్, సందీప్,కార్తీక్, శివకుమార్, యువరాజు, బెక్కెం గ్రామం నుంచి చేరిన వారిలో కృష్ణారెడ్డి, హరికాంత్, రమేష్ సింగ్, వెంకటస్వామి, కాంతయ్య, శేఖర్, సందు కృష్ణారెడ్డి తదితరులు ముఖ్యులు చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎల్లెని సుధాకర్ రావు, ధారా సింగ్, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు జగ్గారి శ్రీధర్ రెడ్డి, గోపి నాయుడు SC మోర్చా మండల అధ్యక్షుడు జానీ, తగరం మనోజ్, తగరం గోవింద్ తదితరులు బిజెపి పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.