సూర్యాపేట పట్టణంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!
సూర్యపేట, 07 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ జుట్టుకొండ సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జుట్టుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ:
దేశాభివృద్ధికి బిజెపి నిదర్శనం: దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్ని రంగాలు ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్ సగర్వంగా తల ఎత్తుకుంటోంది.
అవినీతి రహిత పాలన: గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడు పర్యాయాలుగా ఎలాంటి అవినీతి మరక లేని పారదర్శకమైన పాలనను అందిస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు.
కాంగ్రెస్ వైఫల్యం: తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కేవలం 2 సంవత్సర కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. అబద్ధపు హామీలతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
తెలంగాణలో బిజెపి ప్రభుత్వం: రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు...
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ , మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా నాయకులు సలిగంటి వీరేందర్, బూర మల్సూర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సంధ్యాల సైదులు, మాజీ కౌన్సిలర్లు రంగినేని లక్ష్మణరావు, గోగుల రమేష్, జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, గట్ల ఉమేష్, సిరిపంగి ప్రసాద్, గిలకత్తుల కరుణాకర్, యార్లగడ్డ రామారావు, బండపల్లి శ్రీనివాస్, చేన్నబోయిన రాజేష్, ఎలుగూరి రామ్మూర్తి, కోడి లింగయ్య, సంగు కరుణాకర్, రాపోలు ఉపేందర్, గుడిసె వెంకటేష్, రంగినేని రేహిత్ , జనార్దన్ రెడ్డి , పుల్లారెడ్డి ,మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ సలీం పాషా, జిల్లా మహిళా నాయకురాలు తాడూరి జ్యోతి, గుండు కల్పన , వీరవెల్లి ఉమా మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు...