కొట్లాట కేసులో ఇరు వర్గాలకు శిక్షలు.

Apr 6, 2026 - 21:51
Apr 6, 2026 - 22:01
 0  2
కొట్లాట కేసులో ఇరు వర్గాలకు శిక్షలు.

 పటిష్టంగా కేసు దర్యాప్తు చేసిన పోలీస్

ఒక వర్గానికి చెందిన 6 గురు నేరస్తులకు 2 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 2000 రూపాయలు జరిమానా.

మరో వర్గానికి చెందిన 4 గురు నేరస్తులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా.

తీర్పు వెల్లడించిన కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం.

నల్లబండగూడెం గ్రామంలో 2017 సం.లో భూ వివాదంలో కొట్టుకున్న ఇరు వర్గాలు. 

సూర్యపేట,  07 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- 2017 సంవత్సరంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి నల్లబండగూడెం గ్రామంలో భూ వివాదం విషయంలో రెండు వర్గాలు చట్ట విరుద్ధంగా దాడులు చేసుకున్నారు. దీనిపై ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి కేసును పోలీసులు పట్టిష్టంగా దర్యాప్తు చేశారని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. 

కోదాడ మండలం నళ్ళబండగూడెం గ్రామంలోని ఇరువర్గాలు కొట్లాడుకున్న కేసులో ఇరు వర్గాలపై పరస్పరం కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 మందికి ఒక్కొక్కరికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 2000 రూపాయల జరిమానా మరియు మరొక కేసులో మరొక వర్గానికి నలుగురికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా తీర్పు వెల్లడించిన కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి. 2017 సంవత్సరం జూలై నెలలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  నళ్ళబండగూడెం గ్రామంలోని ఇరువర్గాలు ఆయన కలకుంట రంగయ్య వర్గం మరియు కలకుంట సర్వయ్య వర్గం వారు కొట్లాడుకొనగా కలకుంట కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు పై అప్పటి యస్.ఐ. యం. విజయ ప్రకాష్ గారు కేసు నమోదు చేయనైనది. అదేవిధంగా కలకుంట వెంకటరాములు ఇచ్చిన ఫిర్యాదు పై కూడా అప్పటి యస్.ఐ. యం. విజయ ప్రకాష్ కేసు నమోదు చేసినారు. కేసు తధానంతరం విచారణ పూర్తి చేసి కేసు అభియోగ పత్రాలను ఆధారాలతో సహా గౌరవ  కోదాడ మొదటి అదరపు న్యాయస్థానం నందు ఫైల్ చేయడం జరిగింది. ఈ రెండు కేసుల విషయంలో కోదాడ మొదటి అదరపు న్యాయస్థానం న్యాయమూర్తి గారు కేసులోని సాక్షాదారాలు పరిశీలించి కలకుంట రంగయ్య వర్గానికి చెందిన 6 మందికి ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 2000 రూపాయల జరిమానా మరియు మరొక కేసులోని కలకుంట సర్వయ్య వర్గానికి చెందిన నలుగురికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున జరిమానా అని తీర్పును వెలువరించినారు. ఈ యొక్క కేసులలో న్యాయస్థానం తరఫున ప్రాసిక్యూషన్ తరపున గౌస్ పాషా అదనపు న్యాయవాద, మరియు కళ్యాణి అదనపు న్యాయవాది వాదనలు వాదించినారు, అందుకు కోర్టు కానిస్టేబుల్ పల్లా నరేష్ సహకరించినారు. 
 
చిన్న చిన్న వివాదాలకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. హింసకు పాల్పడితే భవిష్యత్తు అంధకారమవుతుంది. పటిష్టమైన దర్యాప్తు ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేయడంలో సూర్యాపేట జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333