బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సూర్యపేట, 07 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగినేని రుక్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దోసకాయల ఫణి, ఉపాధ్యక్షులు పాండురంగాచారి, జిల్లా ఆఫీస్ సెక్రటరీ రవివర్మ, సూర్యాపేట మండల అధ్యక్షుడు సైదిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల సీనియర్ నాయకులు, బూర మల్సూర్ గౌడ్, వెంకన్న, పృద్వి గౌడ్, జల్లి గణేష్, రమేష్, రవినాయక్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.