సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం పిఎసిఎస్ కొప్పుల నిరంజన్ రెడ్డి

అడ్డగూడూరు 03 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు నిరుపేదలకు గొప్ప వరమని సింగిల్ విండో చైర్మన్ కొప్పల నిరంజన్ రెడ్డి అన్నారు.శుక్రవారం అడ్డగూడూరు మండలంలోని చిన్నపడిశాల గ్రామానికి చెందిన ఒర్సు వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు మంజూరైన రూ,60 వేల సిఎంఆర్ఎఫ్ చెక్కును మృతుడి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తీగల గోవర్ధన్ రెడ్డి, బూత్ అధ్యక్షుడు అంబటి భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బూషిపాక చెన్నయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓర్సు పురుషోత్తం, తునికేసి వెంకట్ రెడ్డి, గుడాల మాధవరెడ్డి, ముస్కు కృష్ణారెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, లోడంగి మల్లయ్య, బిసు యాదయ్య, అంబటిసోమయ్య, కాటి నవీన్ మాగి వెంకన్న, బుషిపాక రవి, ఓర్స్ కృష్ణ, నిమ్మన గోటి ప్రభు, మొర్రిమేకల కొండ య్య, ఓర్సు బుచ్చయ్య, ఓర్సు ఎల్లయ్య, శ్యామల సైదులు , చుక్క శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.