సీఎం చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ భారీ బహిరంగసభను విజయవంతం  చేయాలి   ఎమ్మెల్యే మందుల సామేలు 

Jul 5, 2025 - 20:03
 0  2

అడ్డగూడూరు 04 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరులో గురువారం రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశo మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మనాగోటి జోజి అధ్యక్షతన ఎమ్ ఆర్ గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ముఖ్య అతిథిగా విచ్చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈనెల 14వ తేదీన తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామంలో నిర్వహించు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుతున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారని,భారీ బహిరంగ సభకు గ్రామస్థాయి నుంచి పార్టీ అభిమానులు ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీగా బయలుదేరి సభను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఎ సి హెచ్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటుకల చిరంజీవి, బాలెoలా సైదులు, మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, డైరెక్టర్లు విద్యాసాగర్,సోమయ్య,జోసెఫ్, రవి,సత్యనారాయణ,కడారి రమేష్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల పావన్,వివిధ గ్రామాల నాయకులు,అధ్యక్షులు వెల్దేవి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మంటీపల్లి గంగయ్య, యాదగిరి,జలంధర్,మహేష్, కృష్ణ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333