శ్రీ తిమ్మప్ప స్వామి  అన్నదాన సత్రానికి పోటెత్తిన భక్తులు

Jun 6, 2024 - 20:13
 0  23

జోగులాంబ గద్వాల 6 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  మల్దకల్. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  అన్నదాన సత్రానికి గురువారం భక్తులు పొట్టేత్తారు. వేసవి సెలవులు కావడంతో గత నెల నుండి భక్తులు విపరీతంగా శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నట్లు శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. శ్రీ తిమ్మప్ప స్వామి పకృతి అందాల మధ్య  మల్దకల్ లో వెలసిన స్వామిని తెలంగాణ,ఆంధ్ర రాష్ట్ర భక్తులే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి  వేలాది మంది భక్తులు వస్తుంటారని వారందరి కోసమే గద్వాల కాకతీయ టెక్నో స్కూల్ వారు ఉచిత అన్నదాన కార్యక్రమం శ్రీ తిమ్మప్ప స్వామి సన్నిధిలో నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. గురువారం దాదాపు వెయ్యి మంది వరకు అన్నదానం అందుకున్నారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయానికి అమావాస్య రోజు చాలా  మంది వరకు భక్తులు వస్తుంటారని చెప్పారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333