సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఎన్.పి. ఆర్.డి రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ 

Sep 18, 2025 - 19:34
 0  28
సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఎన్.పి. ఆర్.డి రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ 

భువనగిరి 18 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– పెన్షన్ పెంపు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం సెప్టెంబర్ 20 న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయల ముందు నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కె.వెంకట్ యం.అడివయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్  జిల్లా కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ లు మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4వేల16 నుండి 6వేలకు,వృద్ధులు, వితంతువులతో పాటు మిగతా చేయూత పెన్షన్స్ 2016 నుండి 4వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21నెలలు అవుతుంది.కానీ పెన్షన్ పెంపు కోసం ఎలాంటి చర్యలు తీసుకువడం లేదు.పెన్షన్ పెంచకుండానే ప్రస్తుతం ఇస్తున్నా పెన్షన్ లో 1.92 లక్షల మంది పెన్షన్స్ 21నెలల కాలంలో రద్దు చేశారు.2023 డిసెంబర్ నెలలో ప్రజాపాలన పేరుతో కొత్త పెన్షన్స్ కోసం ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తే 24.85 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.21నెలల నుండి కొత్త పెన్షన్స్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు. పెన్షన్ పెంపు,కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 21నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 2025-26బడ్జెట్లో నిధుల కేటాయింపులో ప్రభుత్వం చేయూత పెన్షన్స్ కోసం అవసరమైన నిధులు కేటాయించలేదు.ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సెప్టెంబర్ 20న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రయివేట్,ఎయిడెడ్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్ లను నియమించాలని డిమాండ్ చేశారు.ఎన్.పి.ఆర్.డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా బోల్లేపల్లి స్వామి,జిల్లా కోశాధికారి కొత్త లలిత,ఉపాధ్యక్షులు బలుగురు అంజయ్య,రంగ సంతోష్,పాండాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333