యువత వ్యసనములపై - అద్భుతమైన బైబిల్ ఆధారిత కౌన్సిలింగ్ ట్రైనింగ్ ఒక దిన సెమినార్
సూర్యాపేట డీయస్.స్పీ. జి రవి
ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి
రెవ. డా. యం. టైటస్ నిర్మల్ కుమార్
లైఫ్ ఛాలెంజ్ ఇండియా,ఆంధ్ర , తెలంగాణా కో - ఆర్డినేటర్
బిషప్ దుర్గం ప్రభాకర్
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
మంగళవారం 22 అక్టోబర్ :సూర్యాపేట పట్టణ కేంద్రం నందు ఎల్ -షడ్డాయి (ఐ.పి.సి)ప్రార్ధన మందిరం తాళ్లగడ్డ లో సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో యువత వ్యసనములపై - బైబిల్ ఆధారిత కౌన్సిలింగ్ ట్రయినింగ్ ఒక దిన సెమినార్ "లైఫ్ ఛాలెంజ్ - ఇండియా" ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధి గా సూర్యాపేట డి.యస్. పి. జి. రవి పాల్గొని మాట్లాడుతూ యువత ను సన్మార్గం లో నడిపించే ఈ పోగ్రాం ను అభింనందిస్తూ, మేము కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నామని, మేము చేసే ఈ పనిలో పాస్టర్స్ వారు కూడా ఈ అవగాహనా సదస్సు నిర్వహించడం ఎంతో హర్షనీయం అనీ అన్నారు.బిషప్ రెవ. డా. యం. టైటస్ నిర్మల్ కుమార్ మరియు యస్. క్రాంతి కుమార్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాల ట్రైనింగ్ కో - ఆర్డినేటర్ లు వ్యసనమలతో పోరాడే వారికి సహాయం చేద్దామా? రండి.దేశ యువతను కాపాడుకుందాం అనే ఆలోచన తో అద్భుతమైన ఒక దిన సెమినార్ మూడు ప్రాముఖ్యమైన అంశముల ద్వారా ట్రైనింగ్ వ్యసనము నుండి కోలుకొనుట, సంపూర్ణ రూపంతరం, శిష్య రికం ద్వారా మార్పు చెందుతారని అన్నారు ,నేటి భారతదేశంలో యవ్వనస్థులు మత్తు పదారర్ధములకు బానిసలై 19% యువకులు, 8% మహిళలు విచ్చలవిడిగా మత్తు పదార్ధములు, డ్రగ్స్, మద్యం, గంజాయి, గుట్కా సేవిస్తూన్నారని వీటి ద్వారా 60% నుండి 70% వరకు గృహహింసలు, విద్యార్థుల లో సెల్ ఫోన్ లకు బానిసలై అస్లీల దృశ్యాలు చూస్తూ,వారి బంగారు బౌషతును నిర్లక్ష్యం చేస్తూ పాడైపోతున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో పాస్టర్స్ గౌరవ సలహాదారులు రెవ. డా. పి. జాన్ మార్క్ (డబ్ల్యూ.యం. ఈ )ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రల డైరెక్టర్,సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్, పాస్టర్ సి. హెచ్. శ్యామ్ ప్రసాద్ సువార్త చర్చ్ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రల కో - ఆర్డినేటర్, బిషప్ ముల్లంగి జాకబ్ రాజు సూర్యాపేట జిల్లా డి. యం. డబ్ల్యూ. సి. ఉపాధ్యక్షులు, రెవ. డా. జలగం జేమ్స్ సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు,రెవ. డా. బొక్క ఏలీయా రాజు, రెవ. డా. పంది మార్కు, పాస్టర్ కొండేటి లాజర్,పాస్టర్ ఉటుకూరి రాజు, పాస్టర్ గుంటూరు బాబు రావు,దాదాపు 55 మంది పాస్టర్స్ మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.