సర్పంచులకు వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానం""నేలకొండపల్లి ఆర్యవైశ్యుల సంఘం

Jan 5, 2026 - 07:19
Jan 5, 2026 - 20:28
 0  17
సర్పంచులకు వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానం""నేలకొండపల్లి ఆర్యవైశ్యుల సంఘం

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ: ఖమ్మం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ అధ్యక్షులు పసుమర్తి సీతా చందర్రావు అధ్యక్షతన ఆర్యవైశ్యులలో పార్టీలకు అతీతంగా రాజకీయంగా గ్రామపంచాయతీ ఎలక్షన్లో గెలుపొందిన సర్పంచులకు ఉపసర్పంచులకు వార్డ్ మెంబర్స్ కు సన్మానించుట జరిగినది ఈ కార్యక్రమంలో మన నెలకొండపల్లి మండలమునకు సంబంధించి రాజారాంపేట సర్పంచ్ రాయపూడి రామారావు, నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ వంగవేటి పవన్ కుమార్ రాయపూడి రోహిత్ రాజేశ్వరపురం గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ పెనుగొండ పద్మావతి గార్లను సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా మహాసభ కార్యవర్గం మరియు జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగూరి వాసవి నెలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ కల్పన గెలుపొందిన వారికి అభినందనలు తెలియజేయడం జరిగినది రాజకీయంగా గెలుపొందిన వారు మాట్లాడుతూ ప్రజలు మా మీద నమ్మకంతో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మా వంతుగా గ్రామపంచాయతీలకి కృషి చేస్తూ బాధ్యతగా ప్రతి ఒక్కరి సమస్యలలో పాల్గొని అధికారులు గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడుతామని తెలియజేశారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State