సమాజసేవకుడికి దక్కిన అరుదైన గౌరవం
స్ఫూర్తి ప్రదాత దైద వెంకన్నకు గౌరవ డాక్టరేట్

డేస్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టాక్సెస్, అమెరికా దేశం వారిచే ధైదకు గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రధానం
అబిడ్స్ ,హైదరాబాద్, 10 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలో ఆబిడ్స్ నందు సూర్య లేక కాంప్లెక్స్ లో సోమవారం " గాడ్ సన్ హోలీ స్పిరిట్ థియోలాజికల్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఎం వి ప్రసాద్ అధ్యక్షతన అవార్డు ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ "డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ "ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సమాజంలో ఎంతోమంది జన్మిస్తారు కానీ ప్రజల గుండెలలో కొద్ది మంది మాత్రమే స్థిర స్థాయిగా నిలుస్తారు వారే మీరు మనం చేసే మంచి పనులే శాశ్వతంగా నిలుస్తాయి సమాజ సేవ సాంస్కృతిక ,కళా , మరియు సాహిత్య రంగానికి విశిష్ట సేవలందించిన వారికి ఈరోజు గౌరవ డాక్టరేట్ స్వీకరించిన వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోత్సహించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళారంగాలను ప్రపంచ పటంలో శాశ్వతంగా ఉండే విధంగా చూడాలన్నారు ఈ సందర్భంగా పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులను గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన దళిత నిరుపేద కుటుంబానికి చెందిన దైద గురువయ్య తిరపమ్మ ల పుణ్య దంపతుల ఏకైక కుమారుడు దైద వెంకన్న కు సామాజిక సాంస్కృతిక సాహిత్య కళారంగానికి అందించిన సేవలను గుర్తించి *హానరరి డాక్టరేట్ ఇన్ సోషల్*సర్వీస్Honorary Doctarate in social Service"విభాగంలో డే స్ప్రింగ్ తీయలాజికల్ యూనివర్సిటీ "టాక్సెస్ అమెరికా వారిచే తెలంగాణ*రాష్ట్ర సాంస్కృతిక చైర్ పర్సన్ " డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ " *చేతులమీదుగా దైద వెంకన్నకు* గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అనింగి రాజశేఖర్ జాతీయ వినియోగదారుల సలహా మండలి చైర్మన్ డాక్టర్ పి అబ్దుల్ రహిమాన్ ప్రొఫెసర్ రెవరెండ్ డాక్టర్ స్టీవెన్ రాజ్ వైస్ ఛాన్స్లర్ (జి ఎస్ హెచ్ ఎస్ టి ఏ )మిస్ యూనివర్స్ 2022 సినీ యాక్టర్ కె సృజన సినీ నటులు తక్షవి , శ్రీలత తదితరులు పాల్గొన్నారు
దైద వెంకన్న ప్రాథమిక ప్రాథమిక ఉన్నత విద్యా వ్యాసం నామవరం గ్రామంలో జరిగింది తారకరామా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సూర్యాపేటలో ఆర్ కె ఎల్ కె డిగ్రీ కళాశాల లో డిగ్రీ పట్టా స్వీకరించారు శ్రీ రామభద్ర డి ఎం ఎల్ టి పారామెడికల్ ఇనిస్ట్యూట్ మిర్యాలగూడలో డిఎంఎల్టి పూర్తి చేశారు మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాల లో బీఈడీ సూర్యాపేటలో చేశారు నల్గొండలో డాన్ బోస్కో పీజీ MA MSW పట్టా స్వీకరించారు.
హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ ద్వారా నిర్వహించిన సాంస్కృతిక సాహిత్య సామాజిక కళా రంగ కార్యక్రమాలు... దైద వెంకన్న కవిగా రచయితగా సామాజిక కార్యకర్తగా రాణిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2015 సంవత్సరంలో నల్గొండ స్టెప్ సీఈవో గారి చేతుల మీదుగా 2500 రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు 2009 నుండి 2019 వరకు ఆరోగ్యశ్రీ పథకంలో ఆరోగ్యమిత్రాగా పనిచేశారు ఎంతోమంది ప్రాణాలను కాపాడారు.2017 సంవత్సరంలో ఆగస్టు 15న అప్పటి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మరియు కలెక్టర్ కే సురేంద్రమోహన్ గారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఆరోగ్య మిత్ర అవార్డు అందుకున్నారు 2022 సంవత్సరంలో సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా జాతీయ సేవారత్న అవార్డు స్వీకరించారు నరసరావుపేటలో విశ్వ జనని ఫౌండేషన్ వారిచే నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా విశ్వజననీ జాతీయ అవార్డు స్వీకరించారు 2019 సంవత్సరంలో శాంతి కృష్ణ సొసైటీ వారిచే వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ గారి చేతుల మీదుగా అంతర్జాతీయ నవరత్నాలు అవార్డు స్వీకరించారు 2023 సంవత్సరంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉగాది పండుగ సందర్భంగా కవి సమ్మేళనంలో పాల్గొని ఉత్తమ కవిగా ఎంపికై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారు మరియు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారి చేతుల మీదుగా 1016 నగదు పురస్కారం అందుకున్నారు ఘనంగా సత్కరించారు జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు స్వీకరించారు
అనాధాశ్రమాలలో వస్త్ర దానం పండ్లు పంపిణీ అన్నదానం చేశారు ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు ప్రముఖుల జయంతి కార్యక్రమాలు సందర్భంగా వ్యాసరచన పోటీలు జనరల్ నాలెడ్జి పోటీలు నిర్వహించి వారికి స్టడీ మెటీరియల్స్ బహుమతులు అందజేశాము ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ చేశాము ఎయి డ్స్ ఓటర్ అవేర్నెస్ పర్యావరణ పరిరక్షణ మొక్కలను నాటాము రోడ్డు భద్రత వారోత్సవాలు విద్య వైద్య రక్తదాన శిబిరాలు అవగాహన సదస్సులు ఉచిత వైద్య శిబిరాలు అవగాహన ర్యాలీలు నిర్వహించాము భ్రూణ హత్యలు నిర్మూలన వరకట్న నిషేధం ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాము మహిళలకు స్వయం ఉపాధి కల్పించాము వినియోగదారులకు మరియు కాలుష్య నిర్మూలన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము వికలాంగులకు మా వంతు సహాయ సహకారాలు అందించాము. బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పొగాకు వ్యతిరేక దినోత్సవం మద్యపాన వ్యతిరేక దినోత్సవం ప్రముఖ కవుల జయంతుల సందర్భంగా కవి సమ్మేళనాలు నిర్వహించాము తప్పిపోయిన వృద్ధులను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాము వీధులలో తిరిగే అనాధలను వృద్ధులను అనాధాశ్రమాలలో చేర్పించాము స్వచ్ఛభారత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు మహిళా దినోత్సవం ప్రతిభావంతుల వారి సేవలను గుర్తించి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులను ప్రధానము చేసి వారి సేవలను అభినందిస్తూ బసవస పత్రాలు జ్ఞాపకాలు స్వర్ణ కంకణాలు ప్రధానం చేసి ఘనంగా సన్మానించాము.
ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని నానుడి మాటకు సేవలో దైద వెంకన్న (జీవిత భాగస్వామి )ధర్మపత్ని దైదఅనిత కుటుంబ సభ్యులు మరియు సంస్థల సభ్యులుపూర్తి సహాయ సహకారాలు అందించారు. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది లక్ష్యాన్ని గురి పెట్టినవాడు విజయాన్ని సాధిస్తాడు. అని నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా డాక్టర్. దైద వెంకన్న మాట్లాడుతూ ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది మూడు దశాబ్దాలుగా సామాజిక సంస్కృతిక కళారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వరించిందని నాకు ఈ గౌరవ డాక్టరేట్ రావడానికి సహకరించిన డాక్టర్ ఎం వి ప్రసాద్ మరియు డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ అమెరికా వారికి ప్రత్యేకంగా మరియు సూర్యాపేట జిల్లా మీడియా మిత్రులకు కృతజ్ఞతలుతెలియజేస్తున్నాను .
శుభాకాంక్షలు తెలిపిన కళాభిమానులు.
సేవా తత్పరులు దైద వెంకన్న గౌరవ డాక్టరేట్ స్వీకరించిన సందర్భంగా సామాజిక ఉద్యమకారులు, కళాభిమానులు సాహిత్య ప్రియులు సామాజిక కార్యకర్తలు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు.
సామాజిక ఉద్యమ నమస్కారాలతో......
దైద వెంకన్న
హోప్ స్వచ్ఛంద సేవా సమితి
సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు
సూర్యాపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం