సమగ్ర కుటుంబ సర్వే కు ప్రజలు సహకరించాలి
మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణ

అడ్డగూడూరు 06 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరదిలోని జానకిపురం గ్రామంలో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక, విద్య, ఉపాది, రాజకీయ, కులగణన సర్వే కోరకు సమగ్ర ఇంటింటి కుంటుంబ సర్వే నిర్వహించడం నిర్వహించారు. స్పెషల్ అధికారి కృష్ణ మాట్లాడుతూ..సర్వే చేసే మీ గ్రామంలో అధికారులు ఇంటింటి కి వచ్చి ప్రతి ఇంట్లోని కుటుంబానికి నెంబరింగ్ స్టికర్ అంటించడం జరుగుతుందని అన్నారు.మీ ఇంట్లో ఉన్న కుటుంబీకుల సంఖ్య మిగతా వివరాలు అధికారులకు తెలిపి వారికి సహకరించగలరని ఆయన తెలియజేశారు. సర్వే చేసిన సమయంలో మీకు తెలిసిన విషయాలు తెలిస్తే చెప్పిన విషయాన్ని అధికారులు వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఇట్టి విషయంలో ప్రజలు భయాందోళన చెందవద్దని మండల స్పెషల్ అధికారి కృష్ణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్చార్జి సెక్రెటరీ నరేష్ ఇరిగేషన్ ఏఈ విక్రమ్ ఎలిమినేటర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.