శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల సందడి

Aug 2, 2025 - 19:29
 0  0
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల సందడి

జోగులాంబ గద్వాల 2 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన శ్రావణమాసంలో శనివారం ప్రత్యేకంగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు దేవాలయానికి వస్తున్నారని తెలిపారు. ఆలయ అర్చకులు మధుసూదనాచారి మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు రాయచూరు పట్టణానికి చెందిన దాసరయ్య గారి గోపాల్ రెడ్డి దంపతులు అన్నదానం ఏర్పాటు చేయగా ఈవో పూజలు నిర్వహించి దాతలను ఘనంగా సన్మానించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదనా  చారి, రవి ,చంద్రశేఖర రావు, వాల్మీకి పూజారులు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333