వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలి

జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్

Nov 18, 2024 - 17:49
 0  11
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలి

భువనగిరి 18 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పెన్షన్ పెంపు కోసం నవంబర్ 20నుండి డిసెంబర్ 9వరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం డిసెంబర్ 9న ఛలో హైదరాబాద్ వికలాంగుల పెన్షన్ 6000లకు పెంచాలని, పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్స్ మంజూరు చేయాలని నవంబర్ 20నుండి డిసెంబర్ 9వరకు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేస్తామని,డిసెంబర్ 9న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తుమని ఎన్ పి ఆర్ డి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు కురునెల్లి వెంకట్ తెలిపారు. సోమవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సురుభంగ ప్రకాష్ అధ్యక్షతన జరిగింది.సందర్బంగా కురునెల్లి వెంకట్ మాట్లాడుతు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000లకు పెంచుతామని, వృద్ధులు, వితంతువుల పెన్షన్ 4000 లకు పెంచుతామని హామీ నిచ్చినరని, అధికారంలోకి వచ్చి 11నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు.పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 24.85 లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు.వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో 34 ఇచ్చిందని, దాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాలో వికలాంగుల శాఖలో ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో శరీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు 25,000 ప్రత్యేక అలావెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి, వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయూలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమనికి బడ్జెట్ లో 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.సదరం సర్టిఫికెట్స్ రిజెక్ట్ అయినా వారికి సర్టిఫికెట్స్ పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంతో పాటు నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసీ, 2017మెంటల్ హెల్త్ కేర్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి కోశాధికారి కొత్త లలిత ఉపాధ్యక్షులు పిట్ట శ్యాంసుందర్ మెరుగు బాబు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333