శివనామస్మరణతో మోగిన శివాలయాలు

Nov 5, 2025 - 17:13
 0  273
శివనామస్మరణతో మోగిన శివాలయాలు

తిరుమలగిరి 05 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణంతో శివాలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుండే అలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు.  శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేస్తూ పుణ్యం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల వ్యాప్తంగా ఉన్న శివాలయాలు లో భక్తులు కిటకిటలాడారు మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన కోక సరిత వారి కుమారుడు కోక లింగస్వామి జలాల్పురం లో మల్లికార్జున స్వామి దేవస్థానంలో నందీశ్వరునికి వెండి కళ్ళు మరియు గుళ్లో గంటను చేయించారు అనంతరం వివిధ గ్రామాల భక్తులు పూజలో పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి