వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసాను అందించాలి

వ్య.కా.సం. నేత ధనుంజయ నాయుడు డిమాండ్

Jul 29, 2025 - 17:43
Jul 29, 2025 - 17:49
 0  5
వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసాను అందించాలి

 ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూమిలేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 10000 రూపాయల ఆత్మీయ భరోసాను అందిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు 

 మంగళవారం నాడు ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ 

 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేర్చడం పట్ల ఆయన హర్షం ప్రకటిస్తూ ముఖ్యంగా ఎలాంటి జీవనాధారం లేని వ్యవసాయ కార్మికులకు తక్షణమే ఆత్మీయ భరోసా అందించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అత్యంత నిరుపేదలైన కేవలం రెక్కాడితే గాని డొక్కాడని దారిద్య రేఖకు దిగువన జీవిస్తున్న వ్యవసాయ కార్మికులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని 

 మున్సిపాలిటీలోనూ అలాగే కార్పొరేషన్లలో కూడా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ స్లం ఏరియాలో జీవనం కొనసాగిస్తున్న అందరికీ జాబ్ కార్డులు ఇచ్చి ఆత్మీయ భరోసా అందించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు 

 ప్రతి మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో నిర్మించి అందులో నిరుపేదలైన వ్యవసాయ కార్మికుల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య అందించాలని వారికి పౌష్టికాహారం అందించి ఆదుకోవాలని కోరారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333