గోల్డ్ మెడల్ సాధించినందుకు సన్మానాలు - మహిళా దినోత్సవ వేడుకలు-  పుట్టినరోజు సంబరాలు

Mar 13, 2024 - 20:37
 0  4

సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత డాక్టర్ బంటు కృష్ణ జర్నలిజం లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ డిగ్రీ తో పాటు గోల్డ్ మెడల్ గెల్చుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ చేతుల మీదుగా అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్నేహితులు బుధవారం సూర్యాపేటలోని ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. తక్కెళ్ళపహాడ్ గ్రామానికి చెందిన క్లాస్మేట్స్ గుండు శివాజీ శోభారాణి, మిర్యాలగూడ కు చెందిన సత్యవతి,  శ్రీనివాస చారిలు పూల బొకేలు అందించి, శాలువా కప్పి సన్మానించి, స్వీట్ లు పంచారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా బంటు అనసూయ, గుండు శోభారాణి, సత్యవతి లను వారి భర్తలు శాలువాగప్పి సన్మానించారు. తదుపరి సత్యవతి జన్మదినోత్సవం ఈరోజే కావడంతో స్వీట్లు పంచుకున్నారు. మొత్తానికి ముగ్గురు క్లాస్మేట్లు తమ జీవిత భాగస్వాములతో కలిసి బుధవారం సూర్యాపేటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంతోషంగా, ఆనందంగా గడిపి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333