వ్యభిచార గృహం పై 5వ టౌన్ పోలీస్ దాడి

నిజామాబాద్ ఏప్రిల్ 04 తెలంగాణ వార్త ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఓ ఇంటిపై ఐదవ టౌన్ పోలీస్ లు దాడి చేశారు.ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు.దాంతో గురువారం సాయంత్రం ఐదవ టౌన్ ఎస్ఐ ఆశోక్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.ఈ దాడిలో ఓ నిర్వాహకుడిని, ఇద్ధరు విటులను,ఐదుగురు మహిళలను గుర్తించారు.వారి వద్ధ నగదు,సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి మహిళలను సఖీ కేంద్రానికి తరలించారు.