వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం""ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Oct 27, 2024 - 17:26
Oct 27, 2024 - 21:37
 0  17
వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటాం""ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. ఆదివారం కాకాని నగర్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో మాట్లాడుతూ ...వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాల్లో చట్టాన్ని అమలు చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు

ప్రజలకు తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుకపై సీనరేజ్‌, జీఎస్‌టీ రద్దు చేసిందన్నారు. 

స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. 

స్థానిక అవసరాలకు నదుల్లో ఇసుక సేకరించేవారు స్థానిక అధికారులకు సమాచారం అందించిన తరువాత మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉంటుందని సూచించారు.

ఇసుక తీసుకెళ్లే వాహనాలపై ఉచిత ఇసుక పథకం బ్యానర్‌ ఉండాలన్నారు. బల్క్‌ బుకింగ్‌ ద్వారా ఇసుక కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. 

ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. కేసులు పెట్టడమే కాకుండా పీడీ యాక్టును ప్రయోగిస్తామన్నారు. ఇసుక రవాణాకు ఈ-ట్రాన్సిట్‌ ఫారం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇసుక రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్‌, ఉచిత ఇసుక బ్యానర్‌ ఉండాలన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State