వెల్దేవి గ్రామంలో డ్రైనేజ్ మోరీ లేక ఇండ్ల మధ్యలో నిలిచిన వర్షపు నీరు

Aug 31, 2025 - 20:08
Aug 31, 2025 - 20:09
 0  147
వెల్దేవి గ్రామంలో డ్రైనేజ్ మోరీ లేక ఇండ్ల మధ్యలో నిలిచిన వర్షపు నీరు

అడ్డగూడూరు 31 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామ పంచాయతీ పరిధిలోని చౌళ్ళగూడెం,దళితవాడలో ఆంజనేయుని గుడి నుండి ప్రభుత్వ పాఠశాల వరకు మెయిన్ రోడ్డు వెంబడి మురికి కాలువ లేక వర్షపు నీరు ఇండ్ల మధ్యలోనే నిల్వ ఉండడం వలన క్రిమి కీటకాలు,దోమల చేరి దుర్వాసనతో విరజిల్లుతున్న నీరు వల్ల మలేరియా,డెంగ్యూ అంటు వ్యాధితో బాధపడవలసిస్తుందని తెలిపారు.సైడ్ మోరిలేని దృశ్యంలోనే చూస్తున్నాం.గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి సైడ్ మోరి నిర్మించాలి! కానీ,నిర్మించలేదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు,సర్పంచులు ఎంతో మంది మారినా గాని సైడ్ మోరి నిర్మించాలని తపన ఎవరికి రాలే..ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టి తీసుకుపోయిర్రా లేదా అనేది ప్రశ్నార్ధకం..?ప్రజల అనుమానం..కూడా ఇప్పటికైనా మోరి అంటే దేవుడేరుగు..రోడ్డు సైడ్ కాలువనైనా తీసి వర్షపు నీరును సాఫీగా సాగేటట్టు చర్యలు తీసుకోవాలని గ్రామవాసులు కోరుతున్నారు. దురదృష్టకరం.. ఏమిటంటే అసలే వర్షాకాలం చినుకు పడితే చాలు ఏరులై పారుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం..సైడ్ మోరీలు లేక ఇండ్ల మధ్యలోనే నిలిచిన వర్షపు నీరు వర్షాకాలం సీజన్ వ్యాధులు ప్రవజిల్లే అవకాశంఉంది.ఇండ్లలో ఉన్న వృద్ధులు,చిన్నపిల్లలు రోగానబారిన పడే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే గ్రామ కార్యదర్శి,సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు,మహిళలు,యువకులు కోరుతున్నారు.