రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బిజెపి మండల పార్టీ నాయకులు నిరసన

Aug 31, 2025 - 20:10
Aug 31, 2025 - 20:11
 0  60
రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బిజెపి మండల పార్టీ నాయకులు నిరసన

అడ్డగూడూరు 31 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– బీహార్ ఎలక్షన్ లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పైన కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు పైన ఆదివారం రోజు అడ్డగూడూరు మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.బీహార్ లో ముందుగానే ఓటమిని ఒప్పుకున్నా రాహుల్ గాంధీ రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి తప్ప వ్యక్తిగత ప్రచారం చేయడం కాంగ్రెస్ సంస్కృతంలో ఉంది ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి రాహుల్ గాంధీ మతిస్థిమతి లేని వ్యాఖ్యలు చేయడానికి దేశ ప్రజలు గమనిస్తున్నారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశానికి చేస్తున్న సేవ ప్రపంచ దేశాలు మెచ్చుకుంటే కండ్లు ఉండి చూడలేని రాహుల్ గాంధీ వ్యక్తిగత దృశప్రచారాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం..ఇలాంటి వాక్యాల వల్ల కాంగ్రెస్ పార్టీ రాను రాను భూస్థాపితం అవ్వడానికి ఇలాంటి వాక్యాలు కారణమవుతాయి నువ్వు ఈ దేశ ప్రధాని కావాలి అనుకుంటున్నా కళను ఈ కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ కొనసాగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాము అని అడ్డగూడూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతూ సైదులు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.