వెల్దేవి గ్రామంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

అడ్డగూడూరు 18 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో ప్రేయర్ పవర్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఘనంగా వేడుకలను నిర్వహించారు. క్రీస్తు మస్త్తులు భక్తి శ్రద్ధలతో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఏసుక్రీస్తు ప్రార్థనలు పాస్టర్ పిల్లి సుందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.సుందర్ వాక్యాలను క్రీస్తు పాఠ్యాంశంగా తెలుపుతూ.. చర్చిలో మిఠాయిలు, స్వీట్లు, కేక్ కట్ చేసి భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలోని వివిధ గ్రామాల క్రీస్తు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.