దేవాలయాల పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ లో నిరసన దీక్షలు.
ఆలయాల సంరక్షణకై ప్రతి హిందువు కదలాలి పరమపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు వివాదంపై కొల్లాపూర్ కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ మరియు ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.. నిరసన దీక్షలో గోవింద నామస్మరణ చేస్తూ పట్టణంలోని పురవీధుల గుండా నామ సంకీర్తన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణను హిందు ధార్మిక సంస్థలకు అప్పగించాలని దేవాలయాలలో అన్యమతస్తులను గుర్తించి వారిని తోలగించలని తెలియజేయటం జరిగింది..ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా సంయోజక్ భజరంగ్ దళ్ పురెందర్, టౌన్ సంయోజక్ పులి భరత్, గోసంరక్షణ సంయోజక్ మహేష్, బిజెపి నాయకులు సందు రమేష్, మెంటే శివకృష్ణ, కాశీపురం మహేష్, గోపాల కృష్ణ, మహేష్ , కన్నయ్య, రవి, లక్ష్మణ్, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు