ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో బధిర బాలికపై అత్యాచారం చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి!

Apr 19, 2025 - 19:00
 0  27
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో బధిర బాలికపై అత్యాచారం చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో బధిర బాలికపై అత్యాచారం చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి!

మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి


భువనగిరి 19 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో బధిర బాలికపై లైంగిక దాడి చేసిన దాన్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఎన్ పి ఆర్ డి  మహిళా విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటలు డిమాండ్ చేస్తున్నవి.దాన్ సింగ్ బధిర బాలికను నమ్మించి వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. బధిర బాలికపై అత్యాచారం చేసిన నిందితునిపై పోక్సో చట్టంతో పాటు 2016 ఆర్పిడి చట్టం సెక్షన్ 92(బి)(డి)(ఇ) ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నవి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధారణ మహిళలతో పాటు వికలాంగులైన మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నవి.బధిర బాలికపై లైంగిక దాడిలో పాల్గొన్న వారందరిని వెంటనే అరెస్ట్ చేయాలి. బాలికపై లైంగిక దాడితో పాటు ముఖముపై తీవ్రమైన గాయాలు చేయడం వారి రాక్షసనందానికి నిదర్శనం. మహిళలపై మృగల్లాప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.పేదలపై కి బులడోజర్స్ పంపుతున్న యోగి బధిర బాలికపై అత్యాచారం చేసిన నిందితునిపై చర్యలు తీసుకోవడంలో విఫలం చెందినరు. వికలాంగుకు రక్షణ కల్పించడంలో యోగి సర్కార్ నిర్లక్ష్యం బయట పడింది.నిందితుణ్ణి పోలీసులు పట్టుకునే సమయంలో నిందితుడు పోలీసు లపైకి కాల్పులు జరపడం దురదృష్టకారం.వికలాంగులైన మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేస్తుంది.లైంగిక దాడికి గురైన బధిర బాలికకు మెరుగైన వైద్యం అందించాలి. నిందితుని నుండి లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబ సభ్యులకు హానిజరిగే అవకాశం ఉంది. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.ఈలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. సురూపంగా ప్రకాష్ ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వనం ఉపేందర్ ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్లపెళ్లి స్వామి ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువనగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త లలిత యాదాద్రి భువనగిరి ఎన్ పి ఆర్ డి  మహిళ జిల్లా కన్వీనర్,కొండాపురం మనోహర మహిళ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మదిరే పద్మ  మహిళ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బర్ల పార్వతి మహిళా జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333