వెటర్నరి లైవ్ స్టాక్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ల ఘనంగా పదవి విరమణ వీడ్కోలు.
జోగులాంబ గద్వాల , 2 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పశువైద్యశాఖ జిల్లా కార్యాలయంలో మంగళవారం మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామంలో పశువైద్యశాలలో పనిచేస్తున్న వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ కె.వెంకటేశ్వర్లు పదవి విరమణ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పశువైద్యశాల ఎడి డాక్టర్ యు.ఆర్.రమేష్ సభాధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి టిఎన్జీఓ నాయకులు భీమన్న,బీజాపూర్ ఆనంద్,నాగార్జున గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ...పదవి విరమణ ప్రతి ఉద్యోగికి సహజమేనని అన్నారు.వెంకటేశ్వరులు నలభై సంవత్సరాల పాటు విధులపరంగా పనిచేసి పలువురి మన్నన్నలు పొందారు.వివిధ గ్రామాలలో పశువైద్యసేవాలు అందించి రైతుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు.పదవి విరమణ అనంతరం వారి జీవిత కాలంలో వారి ఆయురారోగ్యం పట్ల శేష జీవితం గడిపేందుకు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు. అనంతరము పశువైద్య శాఖ అధికారులు, సిబ్బంది ,బంధుమిత్రులు కే. వెంకటేశ్వర్లు అతని సతీమణ సత్యవతి నీ ఘనముగా శాలువలు పూలమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఏడీలు వెంకటనారాయణ,జ్ఞానశేఖర్, శ్రీనివాసులు, సూపర్డెంట్ యాకోబు, సీనియర్ పాత్రికేయులు పెద్ద ఇస్మాయిల్ , తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగ సంఘ నాయకులు బంగి కృష్ణుడు,డాక్టర్లు శంకరయ్య,శిరీష,వినయ్ కుమార్, యామిని సాయి, స్వరూప రాణి, పుష్పలత, జెవివో లు,ఎల్ఎస్ఎ లు,రిటైర్డ్ ఎంఇఓ స్వామి,పశువైద్యశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు , తదితరులు పాల్గొన్నారు.